టాలీవుడ్‌కు కీలకంగా సేవలందించిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి (Director AS Ravi kumar chowdary) మంగళవారం (జూన్ 10) రాత్రి గుండెపోటు(Heart Attack)తో మృతి చెందారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో పాటు హీరోలు గోపీచంద్, నితిన్, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్‌లతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు హఠాన్మరణం ఇండస్ట్రీని కలిచివేసింది. ప్రస్తుతం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానప్పటికీ, ఆయన కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్
ఏఎస్ రవికుమార్ చౌదరి కెరీర్ ప్రారంభం ‘యజ్ఞం’తో ఘనవిజయం సాధించి బలంగా నిలిచింది. ఆ వెంటనే బాలకృష్ణతో చేసిన ‘వీరభద్ర’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం నితిన్ హీరోగా తెరకెక్కించిన ‘ఆటాడిస్తా’, గోపీచంద్‌తో చేసిన ‘సౌఖ్యం’, రాజ్ తరుణ్‌తో చేసిన ‘తిరగబడరా సామి’ సినిమాలు పరాజయాలనే ఎదుర్కొన్నాయి. మధ్యలో సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఒక మంచి బ్రేక్ ఇచ్చినా, మిగిలిన సినిమాల ఫలితాలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో కుటుంబానికి దూరంగా జీవిస్తున్నారని, సినిమా ఫెయిల్యూర్లు, పరిశ్రమలో సన్నిహితుల సహకారం తగ్గడం వలన ఆయన మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. ‘తిరగబడరా సామి’ ప్రారంభోత్సవ వేళ హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దు పెట్టడం ఒక వివాదంగా మారింది. ఈ సంఘటనలు మీడియా దృష్టిలో నిలిచాయి. విజయాల వేదిక నుంచి ఒంటరితనంలోకి జారిన ఈ సీనియర్ డైరెక్టర్, చివరికి తాను సినీ ప్రపంచానికి దూరమవుతూ జీవితం ముగించుకోవడం ఆవేదన కలిగిస్తుంది.