Site icon HashtagU Telugu

Arundhathi Nair : కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హీరోయిన్..సాయం కోసం అభ్యర్ధన

Arundhathi Nair Health Cond

Arundhathi Nair Health Cond

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ (Arundhathi Nair) ఆరోగ్య పరిస్థితి (Arundhathi Nair Health Condition) విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి అరుంధతి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ప్రస్తుతం అరుంధతి తిరువనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది. అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ ఈమె సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘నా స్నేహితురాలు అరుంధతి ప్రమాదానికి గురైంది. ఆమె పరిస్థితి విషమంగా (Critically Injured) ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి మీరూ కూడా సహాయం (Financial Help) చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ బ్యాంకు, ఫోన్‌ నంబర్‌ వివరాలను సోషల్ మీడియాలో పోస్టులో షేర్ చేస్తున్నారు. మరి చిత్రపరిశ్రమ త్వరగా స్పందించి ఆమె సాయం చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. అరుంధతి తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ ఆంటోనీ ‘భేతాళుడు’ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు.

Read Also : Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతు బంధు నిధులు