Site icon HashtagU Telugu

Divya Nagesh : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఆ ఐకానిక్ రోల్ చేసింది ఈమె..

Arundati Child Actress Divya Nagesh Latest Photos And Dance Videos

Arundati Child Actress Divya Nagesh Latest Photos And Dance Videos

Divya Arundati : కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ఒకటి రెండు సినిమాల్లోనే కనిపిస్తారు. ఆ తరువాత మాయం అయ్యిపోతారు. కానీ చేసిన ఆ రెండు సినిమాలతోనే ఆడియన్స్ లో బలమైన గుర్తింపుని సంపాదించుకుంటారు. చిన్నతనంలోనే వారి యాక్టింగ్ చూసి.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకి ఎదుగుతారని ఆడియన్స్ భావిస్తారు. కానీ ఆ చైల్డ్ ఆర్టిస్టులు మాత్రం.. ఒకటి రెండు సినిమాలతో యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకుంటారు. అలా ఒక ఐకానిక్ రోల్ తో ఆడియన్స్ ని మెప్పించి, ఆ తరువాత మళ్ళీ కనిపించకుండా మాయమైపోయిన నటి ‘దివ్య అరుంధతి’.

ఈ పేరు, పైన ఫోటో చూడగానే మీకు ఆర్డమై ఉండాలి. ఈ నటి ఏ సినిమాలో నటించిందో. అవును మీరు గెస్ చేసింది నిజమే.. అనుష్క ‘అరుంధతి’ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టే ఈ దివ్య అరుంధతి. కోడిరామకృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రని దివ్య చేసింది. చిన్నప్పటి అరుంధతి పాత్రలో పవర్ ఫుల్ గా నటించి ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పించింది. క్లాసికల్ డాన్స్ పై కూడా టచ్ ఉండడంతో.. యాక్టింగ్ లో తన హావభావాలతో అందర్నీ మైమరపించింది.

అంతమందు ఒకటి రెండు సినిమాల్లో నటించిన దివ్యకి పెద్ద గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమా తరువాత అరుంధతి అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చేసుకుంది. ఒకవేళ అరుంధతి 2 వస్తే.. దానిలో ఈమెను మెయిన్ లీడ్ లో చూడాలని ఆడియన్స్ ఫీల్ అవుతుంటారు. ఈ విషయానే ఆమెకు తెలియజేసేలా సోషల్ మీడియాలో మెసేజ్ లు పెడుతుంటారు. తెలుగు ఆడియన్స్ లో అంతటి గుర్తింపుని సంపాదించుకున్న ఈ నటి మళ్ళీ తెలుగు సినిమాలోనే కాదు, ఇతర సినిమాల్లో కూడా కనిపించలేదు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. ఫోటోలు, డాన్స్ వీడియోలతో నెటిజెన్స్ ని ఆకట్టుకుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. “ఆడియన్స్ అడిగినట్లు ఒకవేళ అరుంధతి 2 వస్తే తప్పకుండా చేస్తా” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన పై ఇంతటి అభిమానం చూపిస్తున్న ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. మరి ఆ కల్ట్ సినిమాకి సీక్వెల్ చేసే ధైర్యం ఎవరు చేస్తారో చూడాలి.