Site icon HashtagU Telugu

HUE Art Exhibition: ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన సురేష్ దగ్గుబాటి

HUE Art Exhibition

HUE Art Exhibition

HUE Art Exhibition: హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌కు ఆనుకుని ఉన్న స్పిరిట్ మీడియా స్పేస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో HUEని లాంఛనంగా ప్రారంభించారు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ దగ్గుబాటి.

ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ చిత్ర కళలను ఇష్టపడే నగరమని, హైదరాబాద్‌లో ఏక్చిత్ర HUE తొలి ప్రదర్శనను నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈ జనవరి 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో అనేక చిత్రకళలు దర్శనమిస్తున్నాయి. అంతకుముందు రానా దగ్గుబాటి సౌత్‌బేని ప్రమోట్ చేసారు.33 మంది ప్రఖ్యాత కళాకారులు మరియు శిల్పుల నుండి 100 సమకాలీన కళాఖండాలను ‘HUE’ ద్వారా ఏకచిత్ర ఆవిష్కరణ భాగస్వామిగా తీసుకువచ్చింది.

స్పిరిట్ మీడియా మరియు సౌత్‌బే సహ వ్యవస్థాపకుడు రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. సౌత్‌బేలో మేము సంగీతం, క్రీడలు, చలనచిత్రాలు, కళలు మరియు మరెన్నో బ్రాండ్‌లు లపై పని చేస్తున్నామని అన్నారు. కాగా HUE ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఏకచిత్ర (EkChitra) సహకరించింది.

Also Read: YS Sharmila : ఫస్ట్ మీటింగ్ లోనే అన్న ఫై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల