Art Director Nitin Desai: బాలీవుడ్, మరాఠీ సినిమాలకు చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ (Art Director Nitin Desai) బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం ప్రకారం.. 57 ఏళ్ల నితిన్ దేశాయ్ కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నితిన్ దేశాయ్ హిందీ సినిమాకి చెందిన చాలా మంది పెద్ద దర్శకుల చిత్రాల సెట్‌లను డిజైన్ చేసారు. ఖలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ఎమ్మెల్యే మహేశ్ బల్ది మాట్లాడుతూ.. నితిన్ దేశాయ్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు.
నితిన్ దేశాయ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది: రాయ్‌గఢ్ ఎస్పీ
వార్తా సంస్థ ANI తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాయగఢ్ ఎస్పీ ప్రకటనను పంచుకుంది. రాయగడ ఎస్పీ మాట్లాడుతూ.. కర్జాత్‌లోని తన స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. సెట్‌లో పనిచేస్తున్న కార్మికుడు అతని మృతి గురించి మాకు తెలియజేశాడు. పోలీసు బృందం స్టూడియోకి చేరుకున్నప్పుడు, అతని మృతదేహం వేలాడుతూ కనిపించింది. మేము ఈ విషయంలో అన్ని కోణాలను నిర్ధారించడానికి విషయాన్ని మరింత పరిశీలిస్తున్నామన్నారు.
Also Read: 30 Missings: దడ పుట్టిస్తున్న మణిపూర్ అల్లర్లు, 3 నెలల్లో 30 మంది మిస్సింగ్
నితిన్ ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నారని మహారాష్ట్ర ఎమ్మెల్యే మహేశ్ బల్ది అన్నారు. రాయ్‌గఢ్ ఎస్పీతో పాటు, మహారాష్ట్ర ఎమ్మెల్యే మహేశ్ బల్డీ మాట్లాడుతూ.. నితిన్ దేశాయ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. నెలన్నర క్రితం నేను అతనిని కలిసినప్పుడు అతను నాకు చెప్పాడు. ఈ సంఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరిగిందని, అక్కడ ఉన్న ప్రధాన కార్యకర్త నాకు సమాచారం ఇచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నాడు.
పెద్ద దర్శకుల సినిమాల్లో సెట్స్ డిజైన్ చేశారు
ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఇండస్ట్రీలో చాలా మందితో వర్క్ చేశాడు. అతను సంజయ్ లీలా బన్సాలీ హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ వంటి చిత్రాల సెట్స్‌ని డిజైన్ చేశాడు. ఇది కాకుండా దర్శకుడు అశుతోష్ గ్వారికర్ సినిమా ‘జోధా అక్బర్’, సల్మాన్ ఖాన్ చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సెట్‌లను కూడా డిజైన్ చేశాడు. నితిన్ దేశాయ్ నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు.