Site icon HashtagU Telugu

KalyanRam : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కళ్యాణ్ రామ్ , విజయశాంతి

Arjunsonofvyjayanthi

Arjunsonofvyjayanthi

టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం “అర్జున్ S/o వైజయంతి” ( #ArjunSonOfVyjayanthi) ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రిలీజ్ సందర్బంగా చిత్రబృందం ఈరోజు గురువారం తిరుమల (Tirumala ) శ్రీవారిని దర్శించుకుని దేవుని ఆశీస్సులు తీసుకున్నారు.

Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

కళ్యాణ్ రామ్‌ (Kalyan Ram), విజయశాంతి (Vijayashanthi) సహా మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకొని, చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు చిత్రయూనిట్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమలేశుడి దర్శనంతో సినిమాకి శుభారంభం కలగాలని టీం కోరుకున్నారు. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, దేవుడి దీవెనలు తీసుకోవడం వెనుక సెంటిమెంట్ కూడా ఉన్నట్టు చెప్పొచ్చు.

అలాగే ఆలయ ప్రాంగణంలో అభిమానులు కళ్యాణ్ రామ్‌, విజయశాంతిని చూసి ఉత్సాహంతో ఫొటోలు తీసేందుకు పోటీపడ్డారు. వీరి తిరుమల యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాకు ముందు ఈ విధంగా తిరుమల దేవస్థానం సందర్శించడంతో మూవీకి పాజిటివ్ బజ్‌ పెరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. “అర్జున్ S/o వైజయంతి” మూవీ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి.