నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), విజయశాంతి (Vijayashanthi) కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi). నిన్న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బాగానే స్టార్ట్ ఇచ్చింది. సినిమా కథా విషయాలు, విజయశాంతి క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Bodybuilding Vs Steroids : బాడీ బిల్డింగ్‌కు స్టెరాయిడ్స్.. ఎంత డేంజరో తెలుసా ?
ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. “ఎమోషనల్ బ్లాక్ బస్టర్” అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినీ అభిమానుల ఆదరణతో పాటు విజయశాంతి రీ ఎంట్రీకి మంచి స్పందన లభించడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.
వీకెండ్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ చిత్రానికి మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెస్పాన్స్ పెరిగితే ఈ సినిమా లాంగ్ రన్ లోనూ నిలదొక్కుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘అర్జున్ S/O వైజయంతి’ వసూళ్ల పరంగా ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.