Bigg Boss 6: ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అతడే!

తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవ్వుతున్న విషయం తెలిసిందే. చూస్తుండగానే అప్పుడే బిగ్ బాస్ షో

Published By: HashtagU Telugu Desk
Bigg Boss

Bigg Boss

తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవ్వుతున్న విషయం తెలిసిందే. చూస్తుండగానే అప్పుడే బిగ్ బాస్ షో ఆరువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని అప్పుడే ఏడవ వారం ముగింపు దశకు కూడా చేరుకుంది. అయితే ఏడవ వారం ఎలిమినేషన్ సమయం దగ్గర పడుతున్నడంతో కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అని ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు మాత్రం టెన్షన్ టెన్షన్ తో ఉంటారు.

ఇది ఇలా ఉంటే ఏడవ వారం ఎవరు అవుతారా అని బిగ్ బాస్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా మెరీనా వాసంతి లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ అనూష నిర్ణయం తీసుకొని ప్రేక్షకులకు అలాగే కంటెస్టెంట్లకు దిమ్మతిరిగి ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏడవ వారం ప్రేక్షకులు కన్టెస్టెంట్లు ఊహించని విధంగా ఒక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ఏడవ వారం హౌస్ లో నుంచి అర్జున్ కళ్యాణ్ ను ఎలిమినేట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అర్జున్ కళ్యాణ్ అసలు ఎన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండటమే ఎక్కువ అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే అర్జున్ టాస్కులు గేమ్ ల విషయంలో కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎప్పుడు పులిహోర పనిలోనే ఉంటాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు శ్రీ సత్య వెనుక తిరగడం ఆమెను చూసి సొల్లు కార్చుకోవడమే తప్పితే ఆట ఆడింది లేదు. దీంతో ఆరు వారాలు అర్జున్ హౌస్ లో ఉండటమే ఎక్కువ అని అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను గనుక నిజమైతే నిజంగా ఏడో వారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది అని చెప్పవచ్చు.

  Last Updated: 22 Oct 2022, 05:12 PM IST