అల్లు అర్జున్ (Allu Arjun) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు వేడెక్కాయి. తన క్లయింట్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ప్రీమియర్ షోకు సంబంధించిన సమాచారం ముందుగానే పోలీసులకు ఇచ్చామని పేర్కొన్నారు. థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని డిసెంబర్ 2న లేఖ రాసినట్లు న్యాయమూర్తికి తెలుపుతూ ఆ లేఖను కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది, పోలీసులు మాత్రం ఈ వాదనలను వ్యతిరేకించారు. ప్రీమియర్ షో నిర్వహణకు అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను ఏ-11 నిందితుడిగా చేర్చినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. పోలీసులు అందజేసిన సమాచారం ఆధారంగా అందులో అనుమతుల గురించి స్పష్టమైన వివరాలు లేవని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ల రాకకు పోలీసులు అనుమతివ్వలేదని పేర్కొన్నారు. ఆ రోజుకు సంబంధించిన క్లారిటీ కాపీని కోర్టుకు సమర్పించారు. అల్లు అర్జున్ తరపున వాదిస్తున్న న్యాయవాది, కేసు నుండి ఆయనను మినహాయించాలని కోరారు. తొక్కిసలాటకు ముందస్తు సమాచారం ఇచ్చామని, బందోబస్తు ఏర్పాటు చేయలేదని వాదించారు. తమ క్లయింట్‌పై ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు.
Read Also : Allu Arjun Arrest : అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : హరీశ్ రావు