మణిరత్నం సూపర్ హిట్ సినిమాల్లో రోజా, బొంబాయి సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితమే అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో హీరోగా నటించిన అరవింద్ స్వామి ఇప్పటికీ తన నటనతో మెప్పిస్తున్నారు.
అరవింద్ స్వామి ఈమధ్య ప్రతి నాయకుడి రోల్స్ తో పాటుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఐతే హీరోగా చేస్తున్న టైం లో 2000 నుంచి 2013 వరకు ఆయన కేవలం రెండు సినిమాల్లోనే నటించారు.
ఆ టైం లో అరవింద్ స్వామి (Aravind Swamy) సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంటన్నది తెలియలేదు. కానీ ఈమధ్య ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పారు. తనకు పాక్షికంగా పక్షవాతం ఇంకా బ్యాక్ పెయిన్ వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నారు. ఐతే మళ్లీ తిరిగి సినిమాల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు అరవింద్ స్వామి.
అరవింద్ స్వామి సినిమాలకు గ్యాప్..
రీసెంట్ గా కార్తీతో కలిసి మేయలగన్ సినిమాలో నటించారు అరవింద్ స్వామి. ఆ సినిమాను తెలుగులో సత్యం సుందరం(Satyam Sundaram) గా రిలీజ్ చేశారు. 96 సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ఒక రాత్రిలో జరిగే కథగా సత్యం సుందరం మెప్పించింది. ఎమోషనల్ టచ్ వినసొంపైన మ్యూజిక్ తో సినిమా అలరించింది.
ఈ సినిమా తో అరవింద్ స్వామి నటనతో పాటు కార్తీ (Karthi) ఇన్నోసెంట్ యాక్టింగ్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. తెలుగులో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా చేసిన ధృవ సినిమాలో విలన్ గా చేసి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా కాదనేశారని తెలిసిందే.
Also Read : Pooja Hegde : దళపతితో మరోసారి పూజా హెగ్దే..!