Site icon HashtagU Telugu

NC 22 Update: చైతూ NC 22 కీలక పాత్రల్లో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్!

Nagachaitanya

Nagachaitanya

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ఇటివలే సెట్స్ పైకి వెళ్ళింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా కనిపించనుంది. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా NC22 తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

ప్రస్తుతం మేకర్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరింత ఉత్సాహాన్ని పెంచుతూ మేకర్స్ ఈ రోజు NC 22 తారాగణాన్ని పరిచయం చేసారు. వరుస అప్‌డేట్‌లతో, సినిమాలో భాగమైన ప్రముఖ నటీనటులను ప్రకటించారు నిర్మాతలు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన సుప్రీమ్ టాలెంటెడ్ అరవింద్ స్వామి, బ్రిలియంట్ నటుడు శరత్ కుమార్, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలని పోషిస్తున్నారు. ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటీనటులు కూడా తారాగణంలో చేరారు. అద్భుతమైన, ప్రతిభావంతులైన నటీనటుల గురించి తాజా అప్‌డేట్‌లు అభిమానులను, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని ఇచ్చాయి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ చిత్రానికి కెమరామెన్ గా పని చేస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు.

Exit mobile version