Site icon HashtagU Telugu

AR Rahman VS Surgeons Association : సర్జన్స్ అసోసియేషన్‌పై రెహమాన్ రూ.10 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకు ?

Rahman

Rahman

AR Rahman VS Surgeons Association : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ASICON) మధ్య 2018 సంవత్సరంలో మొదలైన వివాదం తీవ్రరూపు దాల్చింది. 2018లో ఒక సంగీత కచేరీని నిర్వహించేందుకు రెహమాన్.. సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి రూ.29.50 లక్షలను తీసుకున్నారు. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అప్పట్లో ఆ కార్యక్రమం అకస్మాత్తుగా రద్దయింది. దీంతో తాము ఇచ్చిన రూ.29.50 లక్షలను తిరిగి ఇవ్వమని రెహమాన్ ను సర్జన్స్ అసోసియేషన్ కోరింది. దీనికి స్పందించిన రెహమాన్ ముందస్తు తేదీ ఉన్న ఒక చెక్కును అందించారు. కానీ బ్యాంకులో డబ్బు లేకపోవడంతో.. ఆ చెక్కు బౌన్స్‌ అయింది. ఇందుకుగానూ  రెహమాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  సర్జన్‌ అసోసియేషన్ చెన్నై మెట్రోపాలిటన్ పోలీసు కమిషనర్‌కు కంప్లయింట్ చేసింది. ఆపై లాయర్ షబ్నం భాను ద్వారా ఏఆర్ రెహమాన్‌కు నోటీసులను కూడా పంపింది.

We’re now on WhatsApp. Click to Join

దీనికి కౌంటర్ గా.. ఏఆర్‌ రెహమాన్‌ తరఫున మద్రాస్‌ హైకోర్టు న్యాయవాది నర్మదా సంపత్‌ వారికి రిప్లై నోటీసులను పంపించారు. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టను దెబ్బతీసేలా పెట్టిన ఈ కేసును మూడు రోజుల్లోగా ఉపసంహరించుకోవడంతో పాటు పరువుకు నష్టం కలిగించినందుకు  రూ.10 కోట్లు చెల్లించాలని  రెహమాన్‌ తరఫున న్యాయవాది కోర్టులో దావా పిటిషన్ వేశారు. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైద్యుల సంఘాన్ని కోరారు. రెహమాన్‌కు సంబంధంలేని మూడో వ్యక్తికి డబ్బు ఇచ్చిన ఇండియన్ సర్జన్స్ అసోసియేషన్.. అనవసరంగా రెహమాన్ పేరును ఇరికించి ఇబ్బంది పెడుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. లేదంటే చట్టపరమైన, క్రిమినల్ చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని న్యాయవాది నర్మదా సంపత్‌ నోటీసు (AR Rahman VS Surgeons Association) ద్వారా తెలిపారు.

Also read : Minister Roja : ఎన్టీఆర్ ఎపిసోడ్ కు మంత్రి రోజా `బ్లూ ఫిల్మ్` ముడి..!