AR Rahaman గ్లోబల్ స్టార్ రాం చరణ్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ సినిమా ఉందని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా లో చరణ్ సరసన జాన్వి కపూర్ ని హీరోయిన్ గా లాక్ చేశారు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అకడమీ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ ని ఎంపిక చేసుకున్నారని తెలిసిందే. అయితే చరణ్ సినిమా కోసం రెహమాన్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మరీ ఈ మూవీకి సాంగ్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది. మామూలుగా అయితే రెహమాన్ ఏ సినిమాకైనా సెట్స్ మీద ఉన్నప్పుడు సాంగ్స్ కంపోజ్ చేస్తాడు. కానీ ఆర్సీ 16 సినిమాకు మాత్రం ముందే సాంగ్స్ ఇచ్చేశాడట.
ఆల్రెడీ చరణ్ బుచ్చి బాబు సినిమాకు 3 సాంగ్స్ కంపోజ్ చేశాడట రెహమాన్. బుచ్చి బాబు తన మొదటి సినిమా ఉప్పెనతో కూడా దేవి శ్రీతో మంచి మ్యూజిక్ తీసుకున్నాడు. ఇప్పుడు రెహమాన్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే మూడు సాంగ్స్ ఇచ్చేశాడట. అకాడమీ విన్నర్ కూడా సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు తన సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశాడని తెలుస్తుంది.
రెహమాన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Eesha Rebba : ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ అని ఒప్పించి సైడ్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఇక్కడ ఎవరు లేరు కాబట్టే..!