Site icon HashtagU Telugu

AR Rahaman Music Concert : తమిళనాడుని ఊపేస్తున్న రెహమాన్ కాన్సర్ట్ వివాదం.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్..

AR Rahaman Music Concert issue shaking Thamilanadu Udhayanidhi Stalin Reacts

AR Rahaman Music Concert issue shaking Thamilanadu Udhayanidhi Stalin Reacts

ప్రస్తుతం తమిళనాడు(Tamilanadu)లో అంతా రెహమన్ మ్యూజిక్ కాన్సర్ట్(AR Rahaman Music Concert) గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ ని ఓ రెండు ఈవెంట్ కంపెనీలు కలిసి సెప్టెంబర్ 10న చెన్నైలో(Chennai) నిర్వహించాయి. ఈ కాన్సర్ట్ టికెట్స్ ని 5, 10,15, 20 వేలకు పైగా అమ్మారు. రెహమాన్ అభిమానులతో పాటు చెన్నైలో ఉన్న చాలా మంది ఈ టికెట్స్ భారీ రేట్స్ పెట్టి కొనుక్కొని మరీ ఈవెంట్ కు హాజరయ్యారు.

అయితే ఇప్పుడు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ వివాదంగా మారింది. అందుకు కారణం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సరిగ్గా నిర్వహించలేకపోవడం. మ్యూజిక్ కాన్సర్ట్ కి 25000 మందికి పర్మిషన్ తీసుకొని దాదాపు 45 వేలకు పైగా టికెట్స్ అమ్ముకున్నారు. పార్కింగ్ ఈవెంట్ జరిగే ప్లేస్ కి దాదాపు 2 కిలోమీటర్లు దూరంలో పెట్టారు. కూర్చోడానికి, నిలబడటానికి కూడా సరైన సౌకర్యాలు కలిపించలేదు, తొక్కిసలాట జరిగింది. కొంతమందిని అయితే లోపలికి పంపించలేదు కూడా. పలువురికి గాయాలు అయ్యాయి. ఈవెంట్ మొత్తం ఫెయిల్ అయింది.

దీంతో ఈవెంట్ లో ఇబ్బంది పడ్డవారు, టికెట్ కొనుక్కున్న బయటే ఉండిపోయిన వారు అంతా సోషల్ మీడియాలో రెహమాన్ కాన్సర్ట్ పై ఫైర్ అవుతున్నారు. ఓ పక్క ఈవెంట్ కంపెనీలను తిడుతూనే మరో పక్క రెహమాన్ ని కూడా విమర్శిస్తున్నారు. ఈవెంట్ లో జరిగిన సమస్యలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కాన్సర్ట్ వివాదం తమిళనాడు అంతా పాకి విమర్శలు వస్తున్నాయి. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన పోలీసులపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో రెహమాన్ చివరకు స్పందించి టికెట్ కొనుక్కొని లోపలికి రాలేకపోయిన వాళ్ళు టికెట్ ని మెయిల్ చేయమని ఒక మెయిల్ ఐడి ఇచ్చారు. వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈవెంట్ లో ఇబ్బందుల గురించి మాట్లాడకపోవడంతో మళ్ళీ విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈవెంట్ కంపెనీ కూడా స్పందించకపోవడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

తాజాగా ఈ వివాదం పెద్దది అవుతుండటంతో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhyanidhi Stalin) రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఆ కాన్సర్ట్ కి నేను హాజరవ్వలేదు. కానీ కాన్సర్ట్ కి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చూశాను. ఈ వివాదానికి సంబంధించి విచారణ జరపమని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నాం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘనటన్లు జరగకుండా చేసుకుంటాము. ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. దీనికి భాద్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని అన్నారు.

మరోవైపు ఈ కాన్సర్ట్ విషయంలో రెహమాన్ పై విమర్శలు చేస్తుండగా పలువురు అభిమానులు, తమిళ ప్రముఖులు ఆయనకి సపోర్ట్ గా మాట్లాడుతూ.. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళది తప్పు అని స్పందిస్తున్నారు.

 

Also Read : Saroj Khan Biopic : బాలీవుడ్ లో మరో బయోపిక్.. ఈ సారి స్టార్ లేడీ కొరియోగ్రాఫర్ కథ..