Site icon HashtagU Telugu

Veera Simha Reddy Pre Release: మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్ ఆర్డర్

Veerasima Reddy

Veerasima Reddy

సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడి వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు నందమూరి బాలయ్య వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా ప్రీరిలీజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మొదట అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేయడంతో హైడ్రామా నెలకొంది. ఆ తర్వాత ఎమ్మెల్యే బాలినేని సంప్రతింపులతో ప్రీరిలీజ్ వేడుకకు అడ్డంకులు తొలగిపోయాయి. హీరో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy) చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు ఒంగోలు సర్వం సిద్ధమైంది. ఇక్కడ ఉత్తర బైపాస్‌ పక్కన.. మండువ వారి సమీపంలో ఉన్న అర్జున్‌ ఇన్‌ఫ్రా ప్రాంగణంలో భారీ స్టేజీని నిర్మించారు. ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్ర్కీన్లను సైతం పెట్టారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకకు హీరో బాలకృష్ణ, హీరోయిన్‌ శృతిహాసన్‌, దర్శకుడు మలినేని గోపీచంద్‌, సంగీత దర్శకుడు తమన్‌, శివమణి, పలువురు గాయనీ గాయకులు హాజరు కానున్నారు.

నిర్వాహకుల ఒత్తిళ్లు

ఇందులో భాగంగా దాదాపు 45 నిమిషాలు సంగీత విభావరి ఉంటుంది. ప్రధానంగా.. ఎంట్రీ పాస్‌ ఉన్నవారిని మాత్రమే దీనికి అనుమతించనున్నట్లు ఈవెంట్‌ నిర్వాహక సంస్థ అధినేత శ్రేయ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకోసం మోస్ట్‌ ఇంపార్టెంట్‌ (ఎంఐపీ), సామాన్య పాసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంఐపీ పాసులు ఉన్న దాదాపు 8వేల మంది కూర్చుని చూసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే, ప్రీరిలీజ్‌ (Pre release) వేడుకకు వృద్ధులు, చిన్నపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకురావద్దని నిర్వాహకులు కోరారు.

పోలీసుల ఆంక్షలు

స్థానిక పోలీసు శాఖ (AP Police) సూచనల ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలను ప్రేక్షకులు తప్పనిసరిగా పాటించి సహకరించాలన్నారు. అయితే వీరసింహారెడ్డి వేడుకపై మితిమీరిన ఆంక్షలు పెట్టడంతో బాలయ్య (Balakrishna) అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే (Veera Simha Reddy) ప్రీరిలీజ్ వేడుకకు మొదటిసారిగా పోలీసుల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించడం, భద్రత కట్టుదిట్టం చేయడంతో ప్రీరిలీజ్ వేడుక చర్చనీయాంశమవుతోంది. పోలీసుల ఆంక్షలతో బాలయ్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య డైలాగ్స్ తో ప్రీరిలీజ్ వేడుకకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.