Online Tickets : RRR, ఆచార్య‌కు బ్యాండే! ‘ఆన్ లైన్’కు గ్రీన్ సిగ్న‌ల్‌

ఏపీ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా...దాన్ని హైకోర్టు సింగిల్ జ‌డ్జి కొట్టివేయ‌డం చాలా కేసుల్లో చూశాం. మ‌ళ్లీ అదే కేసుకు డివిజ‌న్ బెంచ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ కు అనుకూలంగా వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు అనేకం. అలాంటి వాటి జాబితాలోకి తాజాగా సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల వ్య‌వ‌హారం చేరింది.

  • Written By:
  • Updated On - December 20, 2021 / 02:57 PM IST

ఏపీ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా…దాన్ని హైకోర్టు సింగిల్ జ‌డ్జి కొట్టివేయ‌డం చాలా కేసుల్లో చూశాం. మ‌ళ్లీ అదే కేసుకు డివిజ‌న్ బెంచ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ కు అనుకూలంగా వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు అనేకం. అలాంటి వాటి జాబితాలోకి తాజాగా సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల వ్య‌వ‌హారం చేరింది. ప్ర‌భుత్వం ఆన్ లైన్ లో టిక్కెట్ల‌ను అమ్మ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ జీవోను జారీ చేసింది. దాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు సినిమా ప్ర‌ముఖులు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దాన్ని విచారించిన సింగిల్ జడ్జి ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను ర‌ద్దు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌రోసారి హైకోర్టు మొట్టికాయ‌లు అంటూ ప్ర‌చారం హ‌ల్ చ‌ల్ చేసింది.సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్ కు వెళ్లింది. అక్క‌డ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోకు చాలా వ‌ర‌కు అనుకూలంగా ఉత్త‌ర్వులు ఇచ్చింది. డిస్టిబ్యూట‌ర్ల ఇష్టానుసారంగా టిక్కెట్ల‌ను అమ్ముకోవ‌డానికి లేద‌ని డివిజ‌న్ బెంచ్ తేల్చి చెప్పింది. ప్ర‌భుత్వం త‌ర‌పున ఒక క‌మిటీని వేసి దాని ద్వారా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించాల‌ని సూచించింది. క‌మిటీ వివ‌రాల‌ను తెలియ‌చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఏపీఫిల్మ్ డ‌వెల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా ఆన్ లైన్ లో టిక్కెట్ల‌ను అమ్మ‌డానికి హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే, క‌మిటీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గాల‌ని సూచించింది. ఆ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్పాటు చేసే క‌మిటీ ఎలా ఉంటుందో..అంద‌రికీ తెలిసిందే.తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా కాలంగా ఆ న‌లుగురు క‌బంధ హ‌స్తాల్లో ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్ల నుంచి ప‌రిశ్ర‌మ‌ను కాపాడుకునేందుకు ఆన్ లైన్ ప‌ద్ధ‌తిని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. దాన్ని తొలుత సినీ ప్ర‌ముఖులు ఆహ్వానించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఆ ప‌ద్ధ‌తిని వ్య‌తిరేకించాడు. దీంతో ఆన్ లైన్ టిక్కెటింగ్ రాజ‌కీయ మ‌లుపు తిరిగింది.ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో హిట్ సినిమాల‌కు మాత్ర‌మే క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ప్లాప్ సినిమాల‌కు పైస‌లు రావ‌డంలేదు. ఆ జాబితాలో తాజాగా పుష్ప ఉంది. అఖండ క‌లెక్ష‌న్లు భారీగానే ఉన్నాయి

. గ‌తంలో హిట్, ప్లాప్ కు సంబంధం లేకుండా పెద్ద హీరోల సినిమాల క‌లెక్ష‌న్లు ఉండేలా మాఫియా న‌డిచింది. తొలి వారం ఇష్టానుసారంగా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే వాళ్లు. బెనిఫిట్ షోల‌ను విచ్చ‌ల‌విడిగా ప్ర‌ద‌ర్శించేలా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ ఆన్ లైన్ టిక్కెట్ దెబ్బ‌కు రోడ్డున ప‌డే పెద్ద హీరోల సంఖ్య పెర‌గ‌నుంది. తాజాగా హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌తో త్రిబుల్ ఆర్‌, ఆచార్య సినిమా అద‌న‌పు క‌లెక్ష‌న్ల‌కు బ్రేక్ ప‌డేలా ఉంది. బెనిఫిట్ షోల‌కు ఏపీ స‌ర్కార్ నో అంటోంది. ఫ‌లితంగా మునుపటి క‌లెక్ష‌న్ల‌ను చూడాలంటే..సినిమా సూపర్ హిట్ కావాల్సిందే.