Site icon HashtagU Telugu

Thandel : తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

Thandel : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డిరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తండేల్ సినిమాలో రాజుగా నాగ చైతన్య బుజ్జి తల్లిగా సాయి పల్లవి కనిపించనున్నారు.

ఐతే ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా ఏపీలో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లకు 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 75 రూపాయలు రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఐతే తెలంగాణాలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

తండేల్ సినిమా మేకింగ్ వీడియో చూస్తే నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమా తో మరోసారి చైతన్య, సాయి పల్లవి జంట సూపర్ హిట్ కాబోతుందని తెలుస్తుంది. సినిమాకు ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండగా రిలీజ్ రోజు ఫస్ట్ టాక్ కాస్త పాజిటివ్ గా వస్తే మాత్రం సినిమాని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

బజ్ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉండగా నాగ చైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల ప్రాజెక్ట్ గా తండేల్ నిలిచేలా ఉందని చెప్పొచ్చు ఏపీలో పెరిగిన రేట్ల వల్ల తండేల్ కి కలిసి వస్తుందని తెలుస్తుంది. ఐతే తెలంగాణాలో రేట్లు పెంచకపోయినా సాయి పల్లవి చైతన్య కాంబోకి సూపర్ క్రేజ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ అదరగొట్టేలా ఉన్నారని చెప్పొచ్చు.