Fish Venkat : ఫిష్ వెంకట్ కు సహాయం చేసిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ చెప్పిన వెంకట్.. వీడియో వైరల్..

గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమ్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Fish Venkat

Pawan Kalyan Fish Venkat

Fish Venkat : కమెడియన్ గా, కామెడీ విలన్ గా, విలన్ గ్యాంగ్ లో ఒకడిగా ఎన్నో సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్. ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరితోనూ పని చేసారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమ్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, షుగర్, బిపి వచ్చాయని చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని, ఫ్యామిలీ ఆర్థికంగా నష్టాల్లో ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే ఫిష్ వెంకట్ చాలా మందితో పనిచేసినా ఈయన విషయం తెలియక, ఈయన డైరెక్ట్ గా వెళ్లి అడగకపోవడంతో ఎవరూ హెల్ప్ చేయలేదు. కొంతమంది మాత్రం ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఆర్ధిక సహాయం చేసారు. తాజాగా ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ గారిని కలిశానని ఆయన నాకు సహాయం చేసారని చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

ఈ వీడియోలో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. నాకు షుగర్ వచ్చి, బిపి పెరిగి, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. రోజు విడిచి రోజు డయాలసిస్ చేస్తున్నారు. అందరూ నాకు తెలిసిన పెద్దవాళ్ళను కలవమంటున్నారు. కానీ నాకు అలా కలిసి హెల్ప్ అడగాలని లేదు. కానీ మరీ కష్టం అవ్వడంతో కలవాలని అనుకుంటున్నాను. నా భార్య పవన్ సర్ ని కలవమని చెప్పింది. పవన్ సర్ హెల్ప్ చేస్తారు అని చెప్పింది. దాంతో నేను పవన్ సర్ ని ఇటీవల షూటింగ్ సమయంలో కలిసి నా గురించి చెప్పాను. వెంటనే ఆయన స్పందించి కిడ్నీ ట్రీట్మెంట్ విషయంలో నా తరపున చేయాల్సింది నేను చేస్తాను అని అన్నారు. ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదు అంటే రెండు లక్షల రూపాయలు నా బ్యాంకు అకౌంట్ లో వేశారు. ఆయనకు డబ్బు, పదవి మీద వ్యామోహం లేదు. ఆయనకు అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్యూ సర్. మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా మరోసారి పవన్ ని అందరూ అభినందిస్తున్నారు.

 

Also Read : Anasuya : భర్తతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న అనసూయ.. కొత్త సంవత్సరం మొదటిరోజే ఇలా హాట్ గా..

  Last Updated: 02 Jan 2025, 11:32 AM IST