Site icon HashtagU Telugu

Anushka Shetty: అనుష్క నెక్స్ట్ మూవీ అప్డేట్.. టైటిల్ అదిరిందిగా!

Anushka Shetty's Ghaati

Anushka Shetty's Ghaati

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్క, “బాహుబలి” తర్వాత ఎక్కువ సినిమాలకు దూరంగా ఉంటూ, అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. గత సంవత్సరం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన అనుష్క, త్వరలో “ఘాటీ” సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను సందడి చేయటానికి రాబోతుంది.

కొన్ని రోజుల క్రితం, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనుష్క ప్రధాన పాత్రలో “ఘాటీ” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ప్రకటించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ప్రకటించారు. అనుష్క పుట్టిన రోజు అయిన నవంబర్ 7న, “ఘాటీ” సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపారు.

అలాగే, “ఘాటీ” చిత్ర షూటింగ్ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందని ప్రకటించారు. దీంతో అనుష్క అభిమానులు, “ఘాటీ” సినిమా అప్డేట్ కోసం మరియు ఆమె పుట్టిన రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, “ఘాటీ” ఒక పీరియాడిక్ సినిమా.

ఇక, పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమాకు దర్శకుడిగా పనిచేసిన డైరెక్టర్ క్రిష్, అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారన్న సంగతి తెలిసిందే. దీంతో, “హరిహర వీరమల్లు”ని వదిలి, క్రిష్ ఇప్పుడు అనుష్క “ఘాటీ” చిత్రంపై కేంద్రీకృతమయ్యారు. అలాగే ఘాటీ సినిమా థియరిటికల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.