Anushka: మెగా సర్ ప్రైజ్.. ఆచార్యతో అరుంధతి!

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి 'ఆచార్య'లో అతిథి పాత్ర పోషించడం ప్రస్తుతం టాలీవుడ్ ఆసక్తి కలిగిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Anushka

Anushka

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘ఆచార్య’లో అతిథి పాత్ర పోషించడం ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తి కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్క ఓ పాటలో కనిపించనుంది. అయితే ఈ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ తప్పుకోవడం, చిరంజీవి పక్కన ఎవరు నటిస్తారనే విషయమై అటు టాలీవుడ్ లో, ఇటు అభిమానుల్లో ఆసక్తి రేపింది. అయితే దీనికి సంబంధించిన అన్ని విషయాలను మేకర్స్ రహస్యంగా ఉంచుతున్నారు. థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు భావిస్తున్నారని, అందుకే సినిమాలో అనుష్క అతిథి పాత్ర గురించి వెల్లడించడానికి సిద్ధంగా లేరని కూడా టాక్ వినిపిస్తోంది.

‘ఆచార్య’ ప్రమోషన్ జోరుగా సాగుతోంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న భారీ స్థాయిలో జరిగింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇప్పటికే ఆచార్య మూవీకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆచార్య టీం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

  Last Updated: 26 Apr 2022, 11:50 AM IST