Heroines Back to Form : సీనియర్ భామలంతా తిరిగి ఫాం లోకి.. అనుష్క టు శృతి.. సమంత త్రిష కూడా.!

Heroines Back to Form ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలతో కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే వారిలో స్టార్ క్రేజ్ సంపాదించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ అని

Published By: HashtagU Telugu Desk
Anushka To Shruthi Hassan Samantha Trisha Senior Heroines Back To Form In Tollywood

Anushka To Shruthi Hassan Samantha Trisha Senior Heroines Back To Form In Tollywood

Heroines Back to Form ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలతో కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అయితే వారిలో స్టార్ క్రేజ్ సంపాదించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఐతే ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినా సరే సీనియర్ స్టార్ హీరోయిన్స్ డిమాండ్ అలానే ఉంటుంది. తెలుగులో కొత్త భామలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలానే సీనియర్ హీరోయిన్స్ కి కూడా అదే రేంజ్ డిమాండ్ ఉంటుంది.

ఈమధ్య సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా కాస్త వెనకపడినట్టు అనిపించినా ఇప్పుడు మళ్లీ తిరిగి వారు ఫాం లోకి వచ్చారు. తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మెప్పించగా ప్రస్తుతం క్రిష్ తో మరో సినిమా చేస్తుంది. ఆ తర్వాత సమంత కూడా కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది.

శృతి హాసన్ కూడా తెలుగులో సూపర్ ఫాం కొనసాగిస్తుండగా తమన్నా ఆల్రెడీ ఇప్పటికీ దూసుకెళ్తుంది. చాలా కాలం తర్వాత త్రిష కూడా తెలుగులో మళ్లీ వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. చిరు విశ్వంభర తో పాటుగా వెంకటేష్ తో కూడా జత కడుతుందట త్రిష. మొత్తానికి సీనియర్ స్టార్ హీరోయిన్స్ అంతా కూడా మళ్లీ తెలుగు సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. వీరి క్రేజ్ తో ఆ సినిమాలకు కూడా స్పెషల్ ఇంపాక్ట్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. మరి వీరిలో ఎవరి సినిమా ఏ రేంజ్ రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Also Read : Anushka : ఆ సినిమాతో అనుష్క కం బ్యాక్ అవుతుందా..? క్రిష్ ప్లానింగ్ ఆ రేంజ్ లో ఉందా..?

  Last Updated: 23 Feb 2024, 12:44 PM IST