Site icon HashtagU Telugu

Anushka Shetty : ఫ్యాన్స్ కోసం అనుష్క ఆ నిర్ణయం తీసుకుందా..?

Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka Shetty స్వీటీ అనుష్క తన ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది. నిశ్శబ్ధం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ నవీన్ పొలిశెట్టితో సినిమా చేసింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా మళ్లీ సినిమా చేయలేదు. ఈమధ్యనే క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా సైన్ చేసింది అనుష్క. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో అనుష్క తన మార్క్ కంబ్యాక్ ఇస్తుందని అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట అమ్మడు. తన ఫ్యాన్స్ కోసమే ఇక మీదత గ్యాప్ లేకుండా ప్రాజెక్టులు చేయాలని అనుకుంటుందట. అంతేకాదు కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తానని అంటుంది అనుష్క. కొన్నాళ్లు కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రత్యేకమైన సినిమాలు చేయాలని ఉందని చెప్పిన స్వీటీ కాస్త మళ్లీ మనసు మార్చుకున్నట్టు అనిపిస్తుంది.

అనుష్క తీసుకున ఈ డెసిషన్ తో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. క్రిష్ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే అనుష్క ఇక వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేయాలని అనుకుంటుందట. మొత్తానికి అనుష్క మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని అనుకోవడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.