Site icon HashtagU Telugu

Anushka Trolled: లావెక్కిన అనుష్క.. ఆంటీలా ఉందంటూ ట్రోల్స్!

Anushka

Anushka

టాలీవుడ్ (Tollwood) బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి, అరుంధతి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ స్విటీ ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే చాలా రోజుల తర్వాత జాతిరత్నం హీరో నవీన్ తో కలిసి ‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా అనుష్క తన ట్విట్టర్ (Twitter) లో ఓ లేటెస్ట్ ఫొటోను పోస్ట్ చేసింది.

ఆ ఫొటోకు కొందరు ఫ్యాన్స్ ఫిదా అయితే, మరికొందరు మాత్రం ట్రోల్స్ కు దిగారు. అనుష్క ఆంటీలా ఉందంటూ, చాలా బరువు ఎక్కిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలామంది ఫ్యాన్స్ (Fans) మాత్రం చాలా అందంగా ఉన్నావ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న ఈ బ్యూటీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ (Super) సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైంది. తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి,అస్త్రం, డాన్, బలాదూర్, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించింది. అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ (Top Heroine) హోదా సంపాదించారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి లో జేజమ్మ పాత్రను పోషించింది. బాహుబలి (Bahubali): ది బిగినింగ్ మరియు బాహుబలి:ద కంక్లూజన్ అనుష్క సినిమ చరిత్రలో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. అనుష్క ఈ మధ్య సినిమాల్లో నటించడం పూర్తిగా తగ్గించేశారు.

Also Read: 11 Jawans Killed: దంతేవాడలో మావోయిస్టుల కాల్పులు.. 11 మంది జవాన్లు హతం!

Exit mobile version