Site icon HashtagU Telugu

Anushka Loves Virat: విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ.. ఆనందంలో అనుష్క!

Virat

Virat

అందర్నీ ఆకర్షించే జంటల్లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ఒకటి. మూడేళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరికి ఏమాత్రం సమయం దొరికినా టూర్లకెళ్తూ అన్యోనంగా గడుపుతుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది కూడా ఈ కపుల్ ను ఇష్టపడతారు కూడా. ఆసియా కప్ 2022లో టీమ్ ఇండియా రెండో మ్యాచ్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. హాంకాంగ్‌పై విరాట్ కోహ్లీ తన 31వ T20 అర్ధశతకం సాధించాడు. కోహ్లీ ప్రదర్శన ఎందరిలో ఆనందాన్ని నింపింది.

వెంటనే అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ అద్భుతమైన పోస్ట్‌ను మళ్లీ షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ యాభై పరుగులు చేశాడు. కోహ్లీ ఫోటోను పోస్ట్ చేస్తూ, తన భర్త కోసం హార్ట్ ఎమోజీని యాడ్ చేసింది. అనుష్కతో పాటు, భారత క్రికెటర్లు, అభిమానులు, విరాట్‌ను అభినందిస్తున్నారు. రీసెంట్‌గా అనుష్క, విరాట్‌లు ఓ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ కోసం మళ్లీ కలిశారు. ఇద్దరూ మ్యాచింగ్ దుస్తులు ధరించి రాక్ స్టార్స్ లా పోజులిచ్చారు. చిత్రాలను పంచుకుంటూ ‘ఏ దిల్ హై ముష్కిల్ హై’ అంటూ అనుష్క క్యాప్షన్ ఇచ్చింది.