Good News For Prabhas Fans : మరోసారి జంటగా రాబోతున్న ప్రభాస్ – అనుష్క ..?

స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం

Published By: HashtagU Telugu Desk
Anushka Prabhas

Anushka Prabhas

ప్రభాస్ – అనుష్క (Prabhas- Anuhska ) ఈ జంట కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన బిల్లా, మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ప్రేక్షకులను , అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ఫై వీరిద్దర్నీ చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లు వీరిద్దరూ ఉంటారు. అంతే ఎందుకు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు..ప్రేమలో మునిగితేలుతున్నారని ఎప్పటి నుండి వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ..వారు మాత్రం మీము మంచి ఫ్రెండ్స్ అనే చెపుతూ వస్తున్నారు. తాజాగా వీరిద్దర్నీ మరోసారి డైరెక్టర్ సందీప్ (Sandeep Vanga) కలబోతున్నట్లు తెలుస్తుంది.

వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్..రీసెంట్ గా సలార్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్…త్వరలో కల్కి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మారుతీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాక యానిమల్ మూవీ ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్లో స్పిరిట్ (Spirit) మూవీ చేయబోతున్నాడు. స్పిరిట్‌కు సంబంధించిన టైటిల్ ప్రకటించి చాలా రోజులవుతన్నప్పటికీ దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ కాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

దానికి కారణం ప్రభాస్, సందీప్ ఇతర సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల పూజాకార్యక్రమాలు కూడా మొదలు కానప్పటికీ అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వీటీ దగ్గరకు వెళ్లి కథను కూడా వినిపించాడట. దీంతో అనుష్క కూడా ప్రభాస్‌తో మరోసారి నటించేందుకు రెడీ అయినట్లు టాక్. అలాగే స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేసేందుకు మూహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోసారి అనుష్క – ప్రభాస్ కనిపించబోతున్నారనే తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Sreelakshmi Satheesh : ఆ డైరెక్టర్ చేతిలో పడితే ఏ అమ్మాయైనా ఆలా కావాల్సిందే..

  Last Updated: 23 Mar 2024, 12:19 PM IST