Site icon HashtagU Telugu

Miss Shetty Mr Polishetty: మహిళలకు గుడ్ న్యూస్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ స్పెషల్ స్క్రీనింగ్!

Miss Shetty Mr Polishetty

Anushka

Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో మహేష్ పి. దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు చోట్లా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే కలెక్షన్లు ఊహించని విధంగా సాధించకపోవడంతో చిత్ర టీం ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఈ సినిమా టీమ్ మహిళా ప్రేక్షకులకు ఓ ఆఫర్ ఇచ్చింది.

ఈ గురువారం ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లోని మహిళల కోసం మాత్రమే ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నాం. మీ ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలను తీసుకెళ్లండి’ అని అనుష్క ట్వీట్‌లో పేర్కొంది.  ఇందుకు సంబంధించిన వివరాలను అనుష్క ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మా సినిమాను చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ సందేశాలు, ట్వీట్లు, మద్దతును చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

జాతిరత్నాలు మూవీతో ఆకట్టుకున్న నవీన్ ఈ మూవీతోనూ అందరి మనసులు దోచుకున్నాడు. అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత తెరపై కనిపించడంతో ఈ సినిమా చూసేందుకు సినీ లవర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. గత వారం విడుదలై విజయవంతంగా ఆడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ విజయాన్ని అందుకుంది.