Site icon HashtagU Telugu

Anushka : శీలావతిగా అనుష్క.. టైటిలే ఈ రేంజ్ లో ఉందంటే..?

Anushka Krish Title as Silavathi

Anushka Krish Title as Silavathi

Anushka క్రిష్ డైరెక్షన్ లో స్వీటీ అనుష్క ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది. ఒడియా అమ్మాయి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్, ఫస్త్ ఫ్రేం ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్క చాలా స్ట్రాంగ్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా శీలావతి అని ఫిక్స్ చేసినట్టు టాక్. సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోగా రామోజి ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా కూడా చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.

అనుష్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో అనుష్క తన సత్తా చాటింది. ఇప్పుడు అమ్మడు మరో క్రేజీ సినిమాతో రాబోతుంది. శీలావతిగా అనుష్క ఏ మేరకు ఆడియన్స్ ని అలరిస్తుంది అన్నది చూడాలి. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.