Anushka Krish క్రిష్ తో స్వీటీ.. సరోజా గుర్తుందిగా.. నెక్స్ట్ బిగ్ మూవీ..!

Anushka Krish నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఈమధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మెప్పించింది. యువ హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క కలిసి నటించిన ఈ సినిమా మంచి ఫలితాన్ని

Published By: HashtagU Telugu Desk
Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka Shetty New Decission Surprise to her Fans

Anushka Krish నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఈమధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో మెప్పించింది. యువ హీరో నవీన్ పొలిశెట్టితో అనుష్క కలిసి నటించిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇదిలాఉంటే అనుష్క తన నెక్స్ట్ సినిమా లాక్ చేసినట్టు తెలుస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నట్టు టాక్. నాలుగేళ్ల క్రితం మొదలైన క్రిష్ హరి హర వీరమల్లు సినిమా ఇంకా పూర్తి కాలేదు.

అది ఎప్పుడు అవుతుందో కూడా అర్ధం కాని క్రిష్ పవన్ సినిమా పక్కన పెట్టి అనుష్క ని నమ్ముకోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో అనుష్కతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను క్రిష్ తన సొంత ప్రొడక్షన్ ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైమెంట్ లో ప్లాన్ చేస్తున్నారట.

అనుష్కతో ఆల్రెడీ వేదం లాంటి సినిమా చేసిన క్రిష్ మరోసారి అనుష్క తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి కథ కథనాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. అనుష్క మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీ అనగానే ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదివరకు అనుష్క అరుంధతి, భాగమతి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

  Last Updated: 09 Feb 2024, 08:32 AM IST