స్వీటీ అనుష్క తెర మీద కనిపిస్తే ఫ్యాన్స్ లో వచ్చే ఈ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసిన అనుష్క సైలెంట్ గా క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తుంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నా ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
అనుష్క ఘాటి (Ghaati) నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసింది. ఘాటి నుంచి స్వీటీ అనుష్క టీజర్ తో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఈ సినిమా టీజర్ తో అనుష్క స్క్రీన్ నేమ్ ని కూడా అనౌన్స్ చేశారు. అనుష్క ఇన్నేళ్ల సినీ ప్రయాణానికి సింబాలిక్ గా ఆమెకు ది క్వీన్ (The Queen) అనే స్క్రీన్ నేమ్ ని పెట్టారు.
ఈ స్క్రీన్ నేమ్ అనుష్కకి పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఘాటి టీజర్ విషయానికి వస్తే చేతితో కొడవలితో ఆమె నరుకుడు చూస్తే ఇదేదో చాలా పెద్ద సెన్సేషన్ గా మారేలా ఉందనిపిస్తుంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ సినిమా ట్రీట్ అందించేలా ఉందని చెప్పొచ్చు.
అనుష్క (Anushka) ఘాటితో పాటుగా మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేలా రెడీ అవుతున్నారు. అనుష్క ఘాటి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. సినిమాపై ఈ టీజర్ తోనే భారీ అంచనాలు పెంచారు డైరెక్టర్ క్రిష్.
Also Read : Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!