Site icon HashtagU Telugu

Anushka : ఆ సినిమాతో అనుష్క కం బ్యాక్ అవుతుందా..? క్రిష్ ప్లానింగ్ ఆ రేంజ్ లో ఉందా..?

Anushka Shetty Marriage with Kannada Producer

Anushka Shetty Marriage with Kannada Producer

Anushka సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల వేగం తగ్గించింది. సైజ్ జీరో సినిమా కోసం చాలా బరువు పెరిగిన అమ్మడు అది తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఐతే అనుష్క అనుకున్న విధంగా సైజ్ ని తగ్గించుకోలేకపోతుంది. అందుకే సినిమాలు కూడా తగ్గించేసింది. బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత ఐదేళ్లలో నిశ్శబ్ధం అనే సినిమా చేసింది. ఇక చాలా కాలం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అలరించింది అనుష్క.

లేటెస్ట్ గా అనుష్క క్రిష్ డైరెక్షన్ లో ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఒక ఒరియా అమ్మాయి కథతో వస్తుందని తెలుస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చిన అమ్మాయి ఎలా వాటిని ఎదుర్కొని పైకి వచ్చింది అన్న కథతో ఈ సినిమా వస్తుద్నని అంటున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలు కాగా క్రిష్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారని టాక్.

ఈ సినిమాతో అనుష్క తిరిగి ఫాం లోకి వస్తుందని చెబుతున్నారు. అనుష్క కం బ్యాక్ మూవీగా ఇది వస్తుందట. ఈ సినిమా టైటిల్ గా శీలావతి అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో సరోజ పాత్రలో అనుష్క నటన అందరిని మెప్పించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా వస్తుంది. అయితే సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

Also Read : Anjali Geethanjali 2 : గీతాంజలి 2 చంద్రముఖి లా కొడుతుందేంటి..?