Anushka : టాలీవుడ్ హీరోయిన్ అనుష్క చేయని పాత్ర లేదనే చెప్పాలి. అందాలు ఆరబోసే రొమాంటిక్ రోల్స్ నుంచి డివోషనల్ రోల్స్ వరకు ప్రతి పాత్రని ధరించి మెప్పించారు. యాక్షన్ పీరియాడిక్, హారర్ థ్రిల్లర్.. ఇలా ప్రతి జోనర్ లో నటించి ఆకట్టుకున్నారు. తన తోటి హీరోయిన్స్ నుంచి ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్.. ఇన్ని జోనర్స్, ఇన్ని పాత్రలతో ఆడియన్స్ ని మెప్పించిన నటి అంటే అనుష్క అనే చెప్పాలి. దాదాపు రెండు దశబ్దాలగా హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం అనుష్క పెద్దగా సినిమాలు చేయడం లేదు.
అనుష్కతో పాటే గత రెండు దశబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష, నయనతార.. ఇప్పటికే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు. వీరిద్దరితో పోలిస్తే అనుష్క చాలా వెనకబడింది. బాహుబలి సినిమా తరువాత అనుష్క ఇప్పటి వరకు మరో స్టార్ హీరోతో కలిసి నటించలేదు. బాహుబలి తరువాత నాలుగు సినిమాల్లో నటిస్తే.. వాటిలో మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలే. ఆ సినిమాలు కూడా ఏడాదికి ఒకటి రిలీజ్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం కూడా క్రిష్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీనే చేస్తున్నారు.
బాహుబలి వంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తరువాత ప్రభాస్ స్టార్ డమ్ పెరిగింది, దీంతో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. అనుష్క కూడా బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఫేమ్ నే సంపాదించుకున్నారు. కానీ ఆమెకు మాత్రం సినిమా ఆఫర్లు రాలేదు. ఇందుకు కారణం అనుష్క నటించిన ఆ సినిమానే కారణమని కొందరు అంటున్నారు. బాహుబలి సమయంలోనే అనుష్క ‘సైజు జీరో’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు.
ఈ సినిమాలోని పాత్ర కోసం అనుష్క చాలా లావు అయ్యారు. ఇక ఆ మూవీ తరువాత సన్నబడడానికి ఎంత ట్రై చేసిన ఆమె బరువు తగ్గలేకపోతున్నారు. దీనివల్ల బాహుబలి 2 సమయంలో ఇబ్బంది పడినట్లు రాజమౌళి కూడా చెప్పుకొచ్చారు. అనుష్క ఇలా బరువు అవ్వడమే వలనే, ఆమెకు సినిమా అవకాశాలు అందడం లేదని చెబుతున్నారు. అనుష్క ఎంతో కస్టపడి చేసిన సైజు జీరో బాక్స్ ఆఫీస్ వద్ద మెప్పించలేక ప్లాప్ నిలిచింది. ఆ ఒక్క సినిమా అనుష్క చేయకుంటే, ఇప్పుడు ఆమె రేంజ్ మరోలా ఉండేదని ఆమె అభిమానులు చెబుతున్నారు.