చిత్రసీమలో వరుస పెళ్లిళ్లు (Marriages ) అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు మోస్ట్ బ్యాచ్లర్ లైఫ్ ను అనుభవించిన వారంతా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి (Anurag Kulkarni and Ramya Behra married) చేసుకొని షాక్ ఇచ్చారు.
శుక్రవారం నాడు వీరిద్దరి వివాహాం జరిగినట్టుగా గెలుస్తోంది. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కొంత కాలం నుంచి డేటింగ్ కూడా చేశారని, ఇక ఇప్పుడు పెళ్లి పీటలెక్కారని నెటిజన్లు అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగు లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు అనురాగ్ కులకర్ణి. C/o కంచెరపాలెం సినిమాలోని ఆశపాశం సాంగ్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 లోని పిల్లా రా వంటి ఎన్నో పాటలను ఆలరించాడు. బుల్లితెరపై సూపర్ సింగర్ 8 సీజన్ విజేతగా నిలిచాడు అనురాగ్ కులకర్ణి. దీంతో నెమ్మదిగా సినీరంగంలో అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు తనకంటూ ఓ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక రమ్య బెహారా విషయానికి వస్తే.. ఈమె కూడా సూపర్ సింగర్ 4లో పాల్గొంది. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి చిత్రాల్లో అనేక పాటలు పాడింది.. ఆమె గాత్రానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇటీవలే వీరిద్దరు కలిసి హే రంగులే సాంగ్ ఆలపించారు.
Read Also : National Press Day : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధి ఏమిటి..?