Anupama: టిల్లు స్క్వేర్ మూవీ చూసి సిగ్గు పడిన తాత.. అనుపమ రియాక్షన్ ఇదే?

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 11:02 AM IST

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిట్ అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది అనుపమ.

అనుపమకు ఇది చాలా కొత్త పాత్ర. ఎప్పుడూ అనుపమ పక్కింటి అమ్మాయిలా, పద్దతైన పాత్రల్లో కనిపిస్తూ ఉండేది. కానీ మొదటి సారిగా తన హద్దుల్ని చెరిపేసుకుంది. రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. లెక్కలేనన్ని లిప్ లాక్‌లు పెట్టేసింది. ఇక బోల్డ్ సీన్లకు కొదువే లేకుండా పోయింది. తన కెరీర్‌లోనే ఇదొక భిన్నమైన, టర్నింగ్ పాయింట్ లాంటి కారెక్టర్‌ను అనుపమ పోషించింది. ఈ మూవీ హిట్టయింది కాబట్టి ఇకపై అనుపమకు ఇలాంటి రోల్స్ బాగానే వస్తాయి. పైగా తాను మొదటి సారి చేసిన ఈ ప్రయోగానికి మంచి స్పందన వస్తుండటంతో అనుపమ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నట్టుగా ఉంది.

Anupama

ఇక టిల్లు స్క్వేర్‌కు వస్తున్న స్పందన చూసి యూనిట్ కూడా హ్యాపీగానే ఉన్నట్టుగా ఉంది. కాగా ఈ మూవీని థియేటర్లో చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనె రొమాంటిక్ సీన్లకు ఒక తాత ముసిముసి నవ్వులు నవ్వుతూ, సిగ్గు పడ్డ వీడియో ఒకటి బాగానే ట్రెండ్ అయింది. ఈ వీడియో చివరకు అనుపమ వద్దకు చేరుకుంది. ఈ వీడియో చూసి గుండె నిండిపోయిందన్నట్టుగా ఆమె తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది.