Site icon HashtagU Telugu

Anupama Parmeswaran : అనుపమ నెక్స్ట్ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఫ్యాన్స్ ఇప్పుడు మీరు హ్యాపీనా..

Anupama Parmeswaran New Movie Paradha Concept Video Released

Anupama Parmeswaran New Movie Paradha Concept Video Released

Anupama Parmeswaran : అందాల భామ అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు కుర్రాళ్ళో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఇక్కడి అబ్బాయిల మనసులను దోచుకున్నారు. అయితే ఈమధ్య కాలంలో అనుపమ నుంచి వస్తున్న సినిమాల్లో గ్లామర్ డోస్ ఎక్కువైంది. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లో అనుపమ అందాలు ఆరబోస్తూ కనిపించడంతో.. ఆమె ఫ్యాన్స్ అంగీకరించలేకపోయారు.

దీంతో ఇలాంటి పాత్రలు చేయొద్దు అంటూ అనుపమకి రిక్వెస్ట్ వీడియోలు కూడా సెండ్ చేసారు. ఇక అనుపమ కూడా అభిమానుల రిక్వెస్ట్ లను లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే తన నెక్స్ట్ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా, పద్ధతిగా కనిపించబోతున్నారు. నేడు ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ని ఖరారు చేసారు.

ఇక ఈ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ చూస్తుంటే.. ఆడవారు పైట పరదా చాటునే ఉండాలనే సంప్రదాయంతో సాగనుందని తెలుస్తుంది. అలాంటి ఆంక్షలు కలిగిన సంప్రదాయంలో పుట్టిన ఒక ఆడపిల్ల కథే ఈ పరదా మూవీ స్టోరీ అని సమాచారం. లేడీ ఓరియంటెడ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళీ నటి దర్శన రాజేంద్రన్, అలాగే సీనియర్ నటి సంగీత ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారట.

ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. విజయ్ డొంకడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Also read : Venkatesh : ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వెంకీ మామ.. ఏ పార్టీ కోసం తెలుసా..?