అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)..ఈ పేరు చెపితే చాలు యూత్ లో ఎక్కడలేని కోర్కెలు పుట్టుకొస్తాయి. ప్రేమమ్ (Premam) మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి..మొదటి సినిమాతోనే పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అ .. ఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ , కృష్ణార్జున యుద్ధం వంటి వరుస హిట్ల తో అలరించింది. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడేసరికి ఛాన్సులు తగ్గాయి. ఇదే క్రమంలో కొత్త హీరోయిన్ల రాక..వచ్చి రావడమే అందాల ఆరబోత తో ఆకట్టుకోవడం తో నిర్మాతల కళ్లు వారిపై పడ్డాయి. ఇలా వరుస ఛాన్సులతో రాణిస్తున్నారు. కానీ అనుపమ మాత్రం మొదటి నుండి అందాల ఆరబోత (Anupama Exposing) కు దూరంగా ఉంటూ వచ్చింది. ఇదే ఆమెకు ఛాన్స్ లు రాకుండా చేసాయి. ఇక ఇలా మడి కట్టుకుని కూర్చుంటే కుదరదని ..తనలోని అందాలను బయటకు తీయడం మొదలుపెటింది.
రౌడీ బాయ్స్ (Rowdy Boys) మూవీ లో ఘాటైన ముద్దులు..హాట్ హాట్ సీన్లలో రెచ్చిపోయింది. అంతే ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. అప్పటి నుండి రూట్ మార్చిన అనుపమ..సోషల్ మీడియా లోను అందాల ఆరబోత చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి చీర లో దాగిన నడుము అందాలను బయటకు తీసి..యూత్ కు నిద్ర లేకుండా చేసింది. బ్లూ చీరలో నెమలిలా అద్భుతమైన డ్యాన్స్ చేసింది అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Read Also : Viral : భయం..భయం గా ‘భూమ్ భూమ్’ బీరు తాగిన నటుడు శ్రీకాంత్
ఇటీవల ఓనమ్ సెలబ్రేషన్ సమయంలో పాట పాడి ఆడియన్స్ ని ఫిదా చేసిన అనుపమ.. ఇప్పుడు డాన్స్ తో అక్కట్టుకుంటుంది. అనుపమ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు , ఫాలోయర్స్ అనుపమ డాన్స్ కి లైక్స్ కొడుతూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు లో సిద్దు సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తుంది. ఇప్పటీకే విడుదల ఈ చిత్ర ట్రైలర్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా..అనే ఆతృతలో ఫ్యాన్స్ ఉన్నారు.
