Site icon HashtagU Telugu

Anupama Parameswaran: ఆ డైరెక్టర్ కి స్టేజ్ పై అన్నయ్య అంటూ రాఖీ కట్టిన అనుపమ.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Mixcollage 05 Feb 2024 08 01 Am 4389

Mixcollage 05 Feb 2024 08 01 Am 4389

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్. ఈ సినిమాకు కార్తీక్ దశకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో నవదీప్, మధుబాల,అవసరాల శ్రీనివాసులు పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాగా విడుదల తేదీకి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు మూవీ మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం మాస్ మహారాజా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ డైరెక్టర్ ని అన్నయ్య అంటూ షాక్ ఇవ్వడంతో అందమైన అమ్మాయిలు అన్నయ్య అని పిలవకూడదు అంటూ మాస్ మహారాజా రవితేజ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ ఏకంగా ఆ డైరెక్టర్ కి స్టేజ్ పైనే రాఖీ కట్టడంతో పాటు హగ్ కూడా ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ మేకర్స్ అందరూ కూడా పాల్గొన్నారు.

ఇక ఈవెంట్లో అనుపమా మాట్లాడడానికి స్టేజి పైకి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన వీడియోని స్క్రీన్ ప్లే చేయడంతో అందరూ బాగా నవ్వుకున్నారు. దీంతో అనుపమ.. సారీ రవిగారు. నాలుగు సినిమాలు చేశాను కార్తీక్ తో. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను అని చెప్పింది. ఈ లోపు యాంకర్ సుమ ఒక రాఖీ తీసుకొచ్చి అనుపమకి ఇవ్వడంతో అనుపమ స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్ కి రాఖీ కట్టి హగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.