Anupama Parameswaran మలయాళ ప్రేమం సినిమాతో తెరంగేట్రం చేసిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో అ ఆ, ప్రేమం సినిమాలతో అలరించింది. కెరీర్ మొదట్లో తన ఫిజిక్ అవకాశాలు రాకుండా చేస్తుందని భావించిన అనుపమ స్లిం గా మారి సర్ ప్రైజ్ చేసింది. లుక్ మార్చడమే కాదు సినిమాల విషయంలో తన అప్పీల్ కూడా మార్చేసింది అమ్మడు. ఒకప్పుడు గ్లామర్ విషయంలో మొహమాట పడే అనుపమ ఇప్పుడు గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసింది.
ఫోటో షూట్స్ ద్వారానే కాదు సినిమాల్లో కూడా లిప్ లాక్స్ కు సై అనేస్తుంది. దిల్ రాజు ఇంటి హీరో ఆశిష్ తో రౌడీ బోయ్స్ సినిమా చేసిన అనుపమ ఆ సినిమాలో కుర్రాడి తో అదర చుంభనం చేసింది. ఇక లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ సినిమా కోసం కూడా సిద్ధు జొన్నలగడ్డతో రెచ్చిపోయి మరీ నటించింది. టిల్లు స్క్వేర్ కి కావాల్సిన ఎక్స్ ట్రా గ్లామర్ డోస్ ని అనుపమ ఫుల్ ఫిల్ చేసింది.
లేటెస్ట్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూశాక ఆమె ఒకప్పటి అనుపమనేనా అనుకుంటున్నారు. గ్లామర్ లుక్స్.. క్రేజీ మూమెంట్స్.. బాబోయ్ అనుపమ అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. కచ్చితంగా టిల్లు స్క్వేర్ తర్వాత యూత్ అంతా కూడా అనుపమ పేరు జపించేయడం ఖాయమని చెప్పొచ్చు.
అనుపమ లో ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కారణం ఏంటో కానీ ఆడియన్స్ మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన వారికి అనుపమ లోని ఈ గ్లామర్ యాంగిల్ నిజంగానే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.