Site icon HashtagU Telugu

Anupama Parameswaran : సావిత్రి సౌందర్య అనుకుంటే నువ్విలా చేస్తావా.. అనుపమపై అభిమాని ఆవేదన వీడియో వైరల్..!

What is Lilly Aka Anupama Parameswaran Next Step

What is Lilly Aka Anupama Parameswaran Next Step

Anupama Parameswaran మలయాళ భామ కు వీడియో మెసేజ్ అందిస్తూ వీరాభిమాని ఆటో డ్రైవర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమెను సావిత్రి, సౌందర్య అనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఏమన్నాడు అంటే అనుపమ అభిమాని అయిన అతను తన ఆటోలో అనుపమ ఫోటో పెట్టుకున్నాడు.

అయితే వీడియోలో మొదట్లో మీరు చేసిన అ ఆ, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగి, హలో గురు ప్రేమకోసమే సినిమాలు నచ్చాయని ఆ తర్వాత చేసిన రౌడీ బాయ్స్, టిల్లు 2 ట్రైలర్ నచ్చలేదని అంటున్నాడు.

అనుపమని సావిత్రి, సౌందర్య తరహాలో పోల్చుకున్నానని.. కానీ ఆమె ఈమధ్య తన పంథా మార్చి వేరే సినిమాలు చేస్తున్నారని. మీరు మళ్లీ అలాంటి సినిమాలు చేయాలని అభిమాని వీడియో పెట్టాడు. ప్రస్తుతం అనుపమ అభిమాని వీడియో అంటూ ఇది వైరల్ అవుతుంది. హీరోయిన్స్ అన్నాక అన్ని పాత్రలు చేయాలి. సావిత్రి గ్లామర్ రోల్స్ చేయలేదు కానీ సౌందర్య కొన్ని సినిమాల్లో గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేసింది.

అనుపమని వారితో పోల్చడం అభిమాని ప్రేమని అర్ధం చేసుకోవచ్చు కనీ అతను కోరినట్టు సినిమాలు చేయడం అన్నది అది అనుపమ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆటోలో తన ఫోటో పెట్టుకుని అనుపమ అభిమాని చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అనుపమ దాకా ఈ వీడియో వెళ్తే ఆమె దీనికి ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి.