టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె అందం ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అనుపమ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనుపమ ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది.
ప్రస్తుతం మళ్ళీ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. కాగా గత ఏడాది కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అనుపమ ఈ రెండు సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే ఇటీవల అనుపమ, హీరో సిద్దూ జొన్నలగడ్డ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఈనెల 18 న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనుపమ అందాల ఆరబోత డీజేటిల్లు నేహా శెట్టి ని మించిపోయింది. టిల్లు స్క్వేర్ నుంచి వస్తున్న ప్రతి పోస్టర్ రొమాంటిక్ గానే ఉంటోంది.
పోస్టర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అని అందరు షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా అనుపమ టిల్లు స్క్వేర్ లో తన పాత్ర నుంచి బయటకి రాలేకుంది. ఇటీవల ఒక మై లిల్లీ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కంప్లీట్ సాంగ్ మార్చి 18న రిలీజ్ కానుంది. తాజాగా అనుపమ బ్లూ శారీలో సెల్ఫీ ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెల్ఫీ ఫోజుల్లో కూడ అనుపమ లిల్లీ జపమే చేస్తోంది. టిల్లు లవర్ పాత్ర నుంచి బయట పడలేకుంది. లిల్లిలాగా చివరి సారి అల్లరి చేస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. అనుపమ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ అనుపమ ఇంకా టిల్లు స్క్వేర్ క్యారెక్టర్ నుంచి బయటకు రానట్టుంది ఇంకా అలాంటి పోజులే ఇస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..