Allu Arjun National Award : బన్నీ కి నేషనల్ అవార్డు రావడం..ఆ హీరో జీర్ణించుకోలేకపోతున్నాడా..?

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రానికి రెండు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 02:33 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఈ పేరు దేశం వ్యాప్తంగా తగ్గేదేలే అంటుంది. 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరికి దక్కని గౌరవం అల్లు అర్జున్ కు దక్కింది. 2021 ఏడాదికి గానూ చలనచిత్ర జాతీయ పురస్కారాలను (National Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (Allu Arjun)కు అవార్డు వరించింది. 69 ఏళ్ల చరిత్రలో తొలిసారి తెలుగు హీరోకి ఈ అవార్డు దక్కడం విశేషం. ‘పుష్ప’ (Pushpa) సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

ఈ అవార్డు రావడం పట్ల యావత్ చిత్రసీమ (Tollywood) సంబరాలు చేసుకుంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులైతే ఊరు, వాడ , పట్టణం , నగరం అనే తేడాలేకుండా బాణా సంచా కలుస్తూ..బన్నీ కి విషెష్ తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా పవర్ రామ్ చరణ్ , వరుణ్ తేజ్ , సాయితేజ ఇలా మెగా అభిమానులంతా బన్నీ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఇక మిగతా హీరోలు , హీరోయిన్స్ , నటులు సైతం అల్లు అర్జున్ ను కొనియాడుతున్నారు. అయితే ఒక్క హీరోకు మాత్రం ఇది రుచించడం లేదు. ఆయనే బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌.

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ రేంజ్ బాగా పెరిగింది. వరుస పాన్ ఇండియా మూవీస్ పడుతుండడం తో నార్త్ ఆడియన్స్ సైతం తెలుగు సినిమాలపై దృష్టి పెడుతున్నారు. చిన్న , పెద్ద హీరోలు అనే తేడాలేకుండా ప్రతి వారం తెలుగు సినిమా ల రిలీజ్ ఫై దృష్టి పెడుతున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లిస్ట్ లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప , ఆర్ఆర్ఆర్ , కొండపాలెం వంటి చిత్రాలు ఒకటి రెండు కాదు ఏకంగా 10 అవార్డ్స్ దక్కించుకున్నాయి.

Read Also : Rahul Sipligunj : పొలిటికల్ ఎంట్రీ ఫై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..

దీంతో బాలీవుడ్ చిత్రసీమ (Bollywood Industry) బోసిపోయింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని భావించి భంగపడ్డ నటులు నిరాశలో మునిగిపోయారు. తనకు ఉత్తమ నటుడి అవార్డు రాకపోవడం పట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాశ్మీర్ పండిట్ గా పాత్రలో ఒదిగిపోయిన నటించారు. చుట్టూ అల్లరి మూకలు విజృంభిస్తున్న వేళ ప్రాణభయంతో పారిపోయే శరణార్ధిగా నటించారు. ఈ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పడం బాగుంటుంది. ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా వచ్చిన అద్భుత స్పందన నేపథ్యంలో తప్పకుండా తనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఆయన భావించారు. కానీ, చివరకు ఆ అవార్డు అల్లు అర్జున్ ను వరించింది. నాక్కూడా అవార్డు వస్తే బాగుండేది అనేది అనుపమ్ అంటున్నాడు.

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం విభాగంలో అవార్డు దక్కించుకుంది. అటు ఉత్తమ సహాయనటిగా ఈ చిత్రంలో నటించిన పల్లవి జోషి అవార్డుకు ఎంపిక అయ్యింది. అవార్డుల ప్రకటన తర్వాత అనుపమ్ ఖేర్ ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికి రెండు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బట్టి చూస్తే బన్నీ కి కాకుండా తనకు అవార్డు వస్తే బాగుంటుందని తన మనసులో ఫీలింగ్స్ చెప్పకనే చెప్పాడు.