Site icon HashtagU Telugu

Anupam Kher Impressed: రాజమౌళి సింప్లిసిటీకి అనుపమ్ ఖేర్ ఫిదా

Rajamouli

Rajamouli

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు చిత్రనిర్మాత SS రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు.  ‘RRR’ డైరెక్టర్ రాజమౌళి బాలీవుడ్ సీనియర్ నటుడు ఖేర్‌ను హైదరాబాద్‌లోని తన ఇంటిలో భోజనానికి ఆహ్వానించారు. రాజమౌళి ఇంటికి తొలిసారిగా వెళ్లిన ఖేర్ ఆయన్ను సన్మానించాడు. ఖేర్ రాజమౌళి సింప్లిసిటీకి ఫిదా అయ్యాడు “సింపుల్, సక్సెస్ ఫుల్, మావెరిక్” అని ప్రశంసించాడు. “హైదరాబాద్‌లోని మీ ప్రేమకు, రుచికరమైన భోజనానికి ధన్యవాదాలు. మీ ఇంట్లోకి స్వాగతిస్తున్నందుకు  చాలా సంతోషించాను. మీ సింప్లిసిటీని గౌరవిస్తున్నా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అనుపమ్ ఖేర్ స్పందించాడు. అయితే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ డైరెక్టర్ రాజమౌళితో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.