Site icon HashtagU Telugu

Ante Sundaraniki : థ్రిల్లర్‌ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ ‘అంటే.. సుందరానికీ!’ తీయాల్సి వచ్చింది..

Ante Sundaraniki Story Replaced in a Horror Story by Vivek Atreya

Ante Sundaraniki Story Replaced in a Horror Story by Vivek Atreya

నేచురల్ స్టార్ నాని (Nani), వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya) కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘అంటే.. సుందరానికీ!’(Ante Sundaraniki). మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో 2022లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ముందు నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకోవడం, దర్శకుడు వివేక్‌ కూడా ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం, మైత్రీ మూవీ మేకర్స్ కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ మూవీ పై ఓ రేంజ్ అంచనాలే నెలకొన్నాయి.

అంతేకాకుండా నాని అండ్ నజ్రియా (Nazriya Nazim) వంటి క్రేజీ కాంబినేషన్ కావడం మరో ఇంటరెస్టింగ్ విషయం. అయితే ఈ మూవీ థియేటర్స్ వద్ద ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది. మూవీ బాగున్నప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఒక బ్రాహ్మణ కుర్రాడు, ఒక క్రిస్టియన్‌ అమ్మాయి మధ్య ప్రేమ కథని తీసుకోని మతాంతర వివాహాల విషయంలో ఎదుర్కొనే సమస్యల్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే మైత్రీ నిర్మాణంలో నానితో ఒక ప్రాజెక్ట్ ఒకే అయ్యినప్పుడు.. డైరెక్టర్ వివేక్‌ ముందుగా ఒక హారర్ థ్రిలర్ స్టోరీ చెప్పాడట.

ఆ స్టోరీ బాగున్నప్పటికీ, మైత్రీ నిర్మాతలు.. ఒక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనింగ్‌ స్టోరీ కావాలని కోరడంతో ‘అంటే.. సుందరానికీ!’ కథ రాయడం, దానిని తెరకెక్కించడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో వివేక్ చెప్పుకొచ్చాడు. అయితే నాని కెరీర్ లో ఇప్పటి వరకు హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీ రాలేదు. ఒకవేళ హారర్ కథతో తీసి ఉంటే.. సినిమా నిజంగా హిట్ అయ్యి ఉండేదేమో అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మరో మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆ హారర్ స్టోరీ తెరకెక్కే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు.

 

Also Read : Raghava Lawrence : నా ట్రస్ట్‌కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. ఎందుకంటే రాఘవ లారెన్స్