Sundeep Kishan : సందీప్ కిషన్ సినిమాతో మన్మథుడు హీరోయిన్ రీ ఎంట్రీ షురూ..!

మన్మథుడు సినిమాతో ఆకట్టుకున్న అన్షు అంబానీ.. సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారట.

Published By: HashtagU Telugu Desk
Anshu Ambani Is In Talks For A Key Role In Sundeep Kishan Trinatharao Nakkina Sk30 Movie

Anshu Ambani Is In Talks For A Key Role In Sundeep Kishan Trinatharao Nakkina Sk30 Movie

Sundeep Kishan – Anshu Ambani : టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం ‘మన్మథుడు’. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్స్ గా నటించారు. అన్షుకి ఈ సినిమాతోనే యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఈ చిత్రం తరువాత మరో రెండు సినిమాల్లో నటించి యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసారు. పెళ్లి చేసుకొని ఫారిన్ వెళ్ళిపోయి ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చారు.

మన్మథుడు సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అన్షు.. మూడు నాలుగు సినిమాలతోనే కెరీర్ కి ఎండ్ కార్డు వేసేయడంతో చాలామంది ఫీల్ అయ్యారు. అసలు ఆమె ఎందుకు యాక్టింగ్ ని వదిలేశారని చాలామందిలో ఇన్నాళ్లు ఒక సందేహం ఉండేది. ఇక ఇటీవలే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన అన్షు.. తాను యాక్టింగ్ మానేయడానికి గల కారణం తెలియజేసారు. తన తండ్రి ఓవర్ ప్రొటెక్టీవ్‌ అవ్వడం వలనే సినిమాలకు గుడ్ బై చెప్పేసాను. కానీ నటించాలని ఆశ అలానే ఉంది. అందుకే మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చానని చెప్పుకొచ్చారు.

ఇక అన్షు కామెంట్స్ విన్న టాలీవుడ్ మేకర్స్.. తన సినిమాలోని పాత్రల్లో అన్షుని ఊహించేసుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్ కిషన్ తో సినిమా చేస్తున్న ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన.. ఒక పాత్ర కోసం అన్షుని ఎంపిక చేసుకున్నారట. ఇటీవలే అన్షుని కలిసి త్రినాథరావు కథ వినిపించారట. అన్షు కూడా కథ విని పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్ని సెట్ అయితే.. సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఉండబోతుంది.

కాగా ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా కనిపించే హీరోయిన్ ని మేకర్స్ ఇంకా ఎంపిక చేయలేదు. మరి ఆ పాత్రకి ఏ భామని అనుకుంటున్నారో చూడాలి.

  Last Updated: 07 May 2024, 08:39 AM IST