Site icon HashtagU Telugu

ANR Statue: అన్నపూర్ణ స్టూడియో లో ANR విగ్రహావిష్కరణ..తరలివచ్చిన సినీ , రాజకీయ ప్రముఖులు

anr statue unveils at annapurna studios

anr statue unveils at annapurna studios

నేడు అక్కినేని నాగేశ్వర రావు (ANR) శతజయంతి సందర్బంగా అన్నపూర్ణ స్టూడియో లో ANR విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెంకయ్య నాయుడు హాజరై..ఆయన చేతుల మీదుగా ANR విగ్రహావిష్కరణ చేసారు. సాంఘికం, పౌరాణికం, సోషియో ఫాంటసీ, చారిత్రాత్మక, భక్తిరస సినిమాలు ఇలా ఎన్నో చేసి అక్కినేని నాగేశ్వర రావు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచారని గుర్తు చేసారు.

ఈరోజు (సెప్టెంబర్ 20, 2024 న) అక్కినేని శతజయంతి సందర్భంగా ANR స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన కుటుంబ సభ్యులు అందరూ అక్కినేని విగ్రహం పెట్టాలని నిశ్చయించి ,ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై ANR ను గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (RamCharan), నేచురల్ స్టార్ నాని (Nani), మా అధ్యక్షుడు , హీరో మంచు విష్ణు (ManchuVishnu), జగపతి బాబు, బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.

Read Also : Raashi Khanna : అందాలు ఎరవేసి కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంటున్న ఢిల్లీ భామ

ఇక అక్కినేని నాగేశ్వర రావు (ANR) కృష్ణ జిల్లా రామాపురం అనే చిన్న గ్రామంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ అనే దంపతులకు జన్మించారు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ తరలిరావడంలో ANR కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2014 జనవరి 22న ఏఎన్నార్ తుదిశ్వాస విడిచారు. ఇక దాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ లాంటి ప్రఖ్యాత అవార్డులు ఏఎన్నార్ కు సొంతం అయ్యాయి. అలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాల బాధాకరం.

Anr 100th Birth Celebration2