Site icon HashtagU Telugu

ANR Statue Inauguration : ANR విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జయసుధ చేసిన పనికి మోహన్ బాబు ఆగ్రహం

ANR Statue Inauguration

ANR Statue Inauguration

నేడు అక్కినేని నాగేశ్వర రావు (ANR) శతజయంతి సందర్బంగా అన్నపూర్ణ స్టూడియో లో ANR విగ్రహావిష్కరణ (ANR Statue Inauguration) జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెంకయ్య నాయుడు హాజరై..ఆయన చేతుల మీదుగా ANR విగ్రహావిష్కరణ చేసారు. ఇక ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై ANR ను గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (RamCharan), నేచురల్ స్టార్ నాని (Nani), మా అధ్యక్షుడు , హీరో మంచు విష్ణు (ManchuVishnu), జగపతి బాబు, బ్రహ్మానందం (Brahmanandam), అల్లు అరవింద్‌, మురళీమోహన్‌, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, రానా , దిల్‌ రాజు, సుబ్బిరామిరెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు హాజరయ్యారు.

Read Also : Prabhas Maruthi Movie : ప్రభాస్ మారుతి.. చేయాల్సింది చాలా ఉందా..?

ఈ సందర్భంగా ఓ ఆసక్తికర మైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ANR చిత్రసీమకు చేసిన సేవలు, ఆయన చేసిన చిత్రాలు, అవార్డ్స్ , రివార్డ్స్ గురించి ఎంతో గొప్పగా చెపుతూ వస్తున్నారు. అంత ఎంత శ్రద్దగా వింటున్నారు. అయితే సీనియర్ నటి జయసుధ మాత్రం ఫోన్‌ పట్టుకుని ఏదో చూస్తున్నారు. ఆమె పక్కనే కూర్చుకున్న మోహన్ బాబు కు ఆమెను చూసి చిర్రెత్తిపోయాడు. వెన్తనె ఆ ఫోన్‌ లాక్కొని.. సైలెంట్‌ గా కూర్చొమని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజనులు జయసుధ ఫై విమర్శలు చేస్తున్నారు.