Pushpa Raj : అల్లు అర్జున్ కోసం మరో అరవ దర్శకుడు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా రేసులో దిగాడు. పుష్ప (Pushpa Raj) పార్ట్ 1 ని ఏదో సరదాగా హిందీ బెల్ట్ లో రిలీజ్ చేయగా బీ

Published By: HashtagU Telugu Desk
Another Tamil Director For

Another Tamil Director For

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా రేసులో దిగాడు. పుష్ప (Pushpa Raj) పార్ట్ 1 ని ఏదో సరదాగా హిందీ బెల్ట్ లో రిలీజ్ చేయగా బీ టౌన్ ఆడియన్స్ కు పుష్ప రాజ్ పూనకాలు తెప్పించేలా చేశాడు. పుష్ప 2 కోసం సౌత్ ఆడియన్స్ కన్నా హిందీ ఆడియన్స్ ఎక్కువగా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టుగానే వారి అంచనాలకు తగినట్టుగా పుష్ప 2 ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్.

అయితే దానికి ముందు ప్రభాస్ తో సందీప్ సినిమా చేయాల్సి ఉంది. ఈలోగా అల్లు అర్జున్ కూడా మరో సినిమా చేసే అవకాశం ఉంది. నిన్న మొన్నటిదాకా జవాన్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రేసులో మరో తమిళ దర్శకుడు వచ్చి చేరాడు. అతనే జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నెల్సన్ జైలర్ తో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక తన హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ ఉన్నాడని తెలుస్తుంది.

అంతేకాదు రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ కూడా చర్చించాడని చెబుతున్నారు. అన్నీ కుదిరితే జైలర్ డైరెక్టర్ తో బన్నీ సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క. జైలర్ తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన నెల్సన్ అల్లు అర్జున్ (Pushpa Raj) తో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తాడని అల్లు ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాల మీద ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం తమిళ దర్శకులు వరుస కడుతున్నారు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన రాబోయే సినిమాలతో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు. సందీప్ వంగా, నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ ఇలా స్టార్ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ మెగా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.

Also Read : Siri Hanmanth : షారుఖ్ తో ఛాన్స్ అంటే ప్రాంక్ అనుకుందట..!

  Last Updated: 21 Sep 2023, 10:27 AM IST