Site icon HashtagU Telugu

Balakrishna: బాలకృష్ణకు మరో సర్జరీ…అసలేం జరిగింది..?

Balakrishna

Balakrishna

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తోన్న మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ మధ్యే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అఖండ చిత్రం షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన కుడి భజానికి గాయం అయ్యింది. దీంతోకేర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. కొన్నిరోజుల నుంచి బాలయ్య మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.

దీంతో వైద్యులు మరోసారి ఆయనకు శస్త్రచికిత్స్ చేశారు. మైనర్ సర్జరీనేనని…ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరం లేదని…కొద్దిరోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి వైద్యులు దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీంతో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు. దీంతో గోపిచంద్ మలినేని షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version