Site icon HashtagU Telugu

Balakrishna : బాలయ్య ఏందయ్యా నీ దూకుడు..?

Balakrishna

Balakrishna

Balakrishna నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో దూకుడుగా ఉన్నారు. జస్ట్ ఏపీ ఎలక్షన్స్ కోసం ఒక 3 నెలలు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ అవి పూర్తి కాగానే వెంటనే షూటింగ్ షురూ చేశాడు. ఐతే బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకు టైటిల్ గా వీర మాస్ అని ఒకటి ప్రచారంలో ఉంది.

ఐతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అఖండ 2 (Akhanda 2) సినిమా చేయాల్సి ఉంది. ఆల్రెడీ బోయపాటి శ్రీను కథ రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. బోయపాటి, బాలయ్య కాంబో అంటే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఈ సినిమాను కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట బాలకృష్ణ. ఇక ఇదిలాఉంటే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా బాలయ్యతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారట.

ఇప్పటివరకు బాలకృష్ణ తో సినిమా చేయని దిల్ రాజు ఈసారి ఎలాగైనా ప్రాజెక్ట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. బాలకృష్ణ దిల్ రాజు కాంబో సినిమా దాదాపు ఫిక్స్ అని అంటున్నారు. ఐతే దిల్ రాజు ఎవరి డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. దిల్ రాజు (Dil Raju) దగ్గర ఉన్న అసోసియేట్ డైరెక్టర్స్ తో ఎవరినైనా ఈ సినిమా డైరెక్ట్ చేయిస్తారేమో చూడాలి.

వీర మాస్ సినిమా రిలీజ్ కాకుండానే అఖండ 2 మొదలు పెట్టే ఆలోచన చేస్తున్న బాలకృష్ణ. దిల్ రాజు నిర్మాణంలో వచ్చే సినిమాను కూడా త్వరగానే మొదలు పెట్టాలని చూస్తున్నారు. దిల్ రాజు తో బాలయ్య సినిమా అనగానే ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుందని నందమూరి ఫ్యాన్స్ కూడా ఖుషిగా ఉన్నారు.

Also Read : Game Changer : జరగండి సాంగ్‌లో ఉండే మరో హుక్ స్టెప్ పై థమన్ ఆసక్తికర కామెంట్స్..