ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కు వరుస షాకులు తెలుగులుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే లేడి కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పి పోలీసులు అరెస్ట్ (Police Arrest) చేయడం..దీని కారణంగా నేషనల్ అవార్డు మిస్ అవ్వడం తో పాటు పలు ఛాన్సులు కూడా పోవడం జరిగింది. రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ వరుస ఛాన్సులతో బిజీ గా ఉన్న తరుణంలో మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు.
ఈ అసోసియేషన్ కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ (Joseph Prakash) భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. 5వ సారి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆదివారం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారు.
కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసోసియేషన్ సభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జానీ, ఇది తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. అసోసియేషన్ భూమి కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని, దానిపై ప్రశ్నించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమిలో కొన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నిజాలు బయటపెట్టడానికే తనపై కుట్రపూరిత చర్యలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ప్రశ్నించడమే తనపై అనేక ఆరోపణలకు కారణమైందని జానీ మాస్టర్ అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నుంచి తొలగించారని వస్తున్న ప్రచారం అవాస్తవమని, తనను ఎవరూ తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు.
Read Also : PM – Adani Masks : మోడీ-అదానీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్‌గాంధీ ప్రశ్నలకు జవాబులు
