Site icon HashtagU Telugu

Allu Arjun South Number 1 : అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. సౌత్ ఇండియా నెంబర్ 1 పుష్పరాజ్ తగ్గేదేలే..!

Allu Arjun South Number 1 పుష్ప తో పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప 2 మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉండేలా చూస్తున్నారు. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసిన సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలాఉంటే అల్లు అర్జున్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ వచ్చి చేరింది. ఇన్ స్టాగ్రాం లో అల్లు అర్జున్ 25 మిలియన్ల ఫాలోవర్స్ ని ఏర్పరచుకున్నాడు. పాతిక మిలియన్ల ఫాలోవర్ తో సౌత్ లో నెంబర్ 1 గా నిలిచాడు అల్లు అర్జున్. మిగతా సౌత్ స్టార్స్ అంతా ఎంత పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా ఇన్ స్టా ఫాలోవర్స్ లో మాత్రం అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.

అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ కు ఇదొక మరో నిదర్శనమని చెప్పొచ్చు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తాని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో తెలుస్తుంది.

Exit mobile version